వీధి కుక్కల నియంత్రణకు పైలట్​ ప్రాజెక్ట్​

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్ న‌గ‌రంలో వీధి కుక్కల నియంత్రణ‌కు వంద శాతం కుటుంబ నియంత్రణ స్టెరిలైజేష‌న్‌తో పాటు యాంటి రాబిస్ వ్యాక్సినేష‌న్ చేస్తున్నట్లు జీహెచ్​ఎంసీ చీఫ్​ వెటర్నరీ ఆఫీసర్​ అబ్దుల్​ వకీల్​ తెలిపారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ ఆగ‌ష్టు 15వ‌ర‌కు అమ‌లు చేయ‌నున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో ఉన్న ఐదు యానిమ‌ల్ కేర్ సెంట‌ర్లలో ప్రతి సెంట‌ర్ నుంచి ఒక వార్డును ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. ఫ‌తుల్లాగూడ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ […]

Update: 2020-06-27 08:02 GMT

దిశ, న్యూస్​బ్యూరో: హైదరాబాద్ న‌గ‌రంలో వీధి కుక్కల నియంత్రణ‌కు వంద శాతం కుటుంబ నియంత్రణ స్టెరిలైజేష‌న్‌తో పాటు యాంటి రాబిస్ వ్యాక్సినేష‌న్ చేస్తున్నట్లు జీహెచ్​ఎంసీ చీఫ్​ వెటర్నరీ ఆఫీసర్​ అబ్దుల్​ వకీల్​ తెలిపారు. ఈ నెల 15న ప్రారంభ‌మైన ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ ఆగ‌ష్టు 15వ‌ర‌కు అమ‌లు చేయ‌నున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ప‌రిధిలో ఉన్న ఐదు యానిమ‌ల్ కేర్ సెంట‌ర్లలో ప్రతి సెంట‌ర్ నుంచి ఒక వార్డును ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. ఫ‌తుల్లాగూడ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలోని హ‌య‌త్‌న‌గ‌ర్ స‌ర్కిల్‌లో నాగోల్-11 వార్డును, చుడీబ‌జార్ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలోని చార్మినార్ స‌ర్కిల్‌లో ఉన్న శాలిబండ-48 వార్డును, ప‌టేల్‌న‌గ‌ర్ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలోని మెహిదీప‌ట్నం స‌ర్కిల్‌లో ఉన్న అసీఫ్‌న‌గ‌ర్‌-72 వార్డును, కె.పి.హెచ్‌.బి కాల‌నీ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలోని శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లో ఉన్న శేరిలింగంప‌ల్లి-106 వార్డును, మ‌హ‌దేవ్‌పూర్ యానిమ‌ల్ కేర్ సెంట‌ర్ ప‌రిధిలో ఉన్న గాజుల‌రామారం స‌ర్కిల్‌లోని గాజుల‌రామారం -125 వార్డుల‌లో ఈ పైలెట్ ప్రాజెక్ట్‌ను అమ‌లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఐదు వార్డుల్లో దాదాపు 20వేల వీధి కుక్కలు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వ‌ర‌కు 1,179 వీధి కుక్కల‌కు కుటుంబ నియంత్రణ స్టెరిలైజేష‌న్‌, 2,016 వీధి కుక్కల‌కు యాంటీ రేబిస్ వ్యాక్సినేష‌న్ చేసిన‌ట్లు తెలిపారు.

Tags:    

Similar News