లిఫ్ట్ గుంతలో పడి ఒకరి మృతి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్ గుంతలో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. ఉపాధి నిమిత్తం యూపీకి చెందిన కరణ్ కుమార్ (24) హైదరాబాదుకు వచ్చాడు. అయ్యప్ప సొసైటీ‌లో టైల్స్ కాంట్రాక్టర్‌గా అతను పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ట్రైన్‌లో అతను యూపీకి వెళ్లాలనుకున్నాడు. అందుకోసం బడిచౌడిలో నిర్మాణంలో ఉన్న భవనంలో […]

Update: 2020-10-09 09:21 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్ గుంతలో పడి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. ఉపాధి నిమిత్తం యూపీకి చెందిన కరణ్ కుమార్ (24) హైదరాబాదుకు వచ్చాడు. అయ్యప్ప సొసైటీ‌లో టైల్స్ కాంట్రాక్టర్‌గా అతను పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ట్రైన్‌లో అతను యూపీకి వెళ్లాలనుకున్నాడు. అందుకోసం బడిచౌడిలో నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న సోదరుడు రంజిత్ వద్దకు గురువారం సాయంత్రం అతను వచ్చాడు. కాగా రాత్రి సమయంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో రంజిత్ వంట చేస్తున్నాడు. ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతూ భవనంలోని నాలుగవ అంతస్తుకు కరణ్ కుమార్ వెళ్ళాడు. చాలాసేపు పైన ఉండి ఫోన్ మాట్లాడాడు. భోజనం చేసేందుకు కిందికి రావాలని సోదరుడు రంజిత్ పిలవడంతో ఇప్పుడే వస్తున్నానని అతను చెప్పాడు. నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ గుంతలో కొద్ది సేపటి తర్వాత శబ్దం వచ్చింది. దీంతో రంజిత్ అక్కడికి వెళ్లి చూశాడు. రక్తపుమడుగులో కరణ్ కుమార్ పడి ఉండడం చూసి అతన్ని ఆస్పత్రికి రంజిత్ తరలించాడు. కాగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు రంజిత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News