ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జెరోధా !

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ యూనికార్న్ కంపెనీ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తన ఉద్యోగులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థలోని ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారికి ప్రత్యేకంగా బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. 12 నెలల వరకు ‘హెల్త్ ఛాలెంజ్’ స్వీకరించి ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది. నెలకొకసారి ఫిట్‌నెస్‌కు సంబంధించి అప్‌డేట్ చేయాలని, ఈ ఛాలెంజ్ కొవిడ్ మహమ్మారి పరిణామాల తర్వాత కూడా ఉంటుందని, శాశ్వతంగా దీన్ని కొనసాగించనున్నట్టు కంపెనీ సీఈఓ […]

Update: 2021-08-29 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ యూనికార్న్ కంపెనీ జిరోధా బ్రోకింగ్ లిమిటెడ్ కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో తన ఉద్యోగులకు భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సంస్థలోని ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారికి ప్రత్యేకంగా బోనస్ ఇవ్వనున్నట్టు తెలిపింది. 12 నెలల వరకు ‘హెల్త్ ఛాలెంజ్’ స్వీకరించి ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది. నెలకొకసారి ఫిట్‌నెస్‌కు సంబంధించి అప్‌డేట్ చేయాలని, ఈ ఛాలెంజ్ కొవిడ్ మహమ్మారి పరిణామాల తర్వాత కూడా ఉంటుందని, శాశ్వతంగా దీన్ని కొనసాగించనున్నట్టు కంపెనీ సీఈఓ నితిన్ కామత్ ఓ ప్రకటనలో తెలిపారు.

గతేడాది నుంచి మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వల్ల ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం అధికంగా ఉందని, వాళ్లు తిరిగి ఫిట్‌గా మారేందుకు ఈ ఛాలెంజ్ ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి నితిన్ కామత్ ట్విటర్ ద్వారా ఈ ఛాలెంజ్ వివరాలను వివరించారు. ఈ హెల్త్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ఉద్యోగికి ఒక నెల వేతనం బోనస్ ఇస్తామని, అదేవిధంగా లక్కీ డ్రా తీసి రూ. 10 లక్షలు కూడా ఇవ్వనున్నట్టు నితిన్ కామత్ పేర్కొన్నారు. ఉద్యోగులు ఆరోగ్యం విషయంలో ఫిట్‌గా ఉండటం ద్వారా పనితీరు మెరుగుపడుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.

Tags:    

Similar News