నెల్లూరు స్పెషల్: పెళ్లి విందు.. జంతువులకు మాత్రమే..

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ఇల్లు.. పెళ్లి పనులతో అందరు ఎవరిపనుల్లో వారు బిజీ గా ఉన్నారు. వధూవరులు వచ్చినవారందరిని పలకరిస్తున్నారు. ఇక భోజనాల సమయం అయ్యింది. వధూవరులు గోశాలకు బయల్దేరారు. అక్కడ అన్ని రకాల భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని వడ్డించి ఉంచారు.. అథిదులు  వచ్చి ఆరగించడమే తరువాయి.. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటూ అతిధులు వడ్డించినవాటిని మొత్తం తినేస్తున్నాయి. ఎప్పుడు తిన్నాయో ఏంటో అన్ని ఆరగించేస్తున్నాయి. అదేంటి గోశాలలో పశువులు కదా ఉండేది అక్కడ పెళ్లి విందు […]

Update: 2021-06-06 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి ఇల్లు.. పెళ్లి పనులతో అందరు ఎవరిపనుల్లో వారు బిజీ గా ఉన్నారు. వధూవరులు వచ్చినవారందరిని పలకరిస్తున్నారు. ఇక భోజనాల సమయం అయ్యింది. వధూవరులు గోశాలకు బయల్దేరారు. అక్కడ అన్ని రకాల భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. అన్ని వడ్డించి ఉంచారు.. అథిదులు వచ్చి ఆరగించడమే తరువాయి.. ఇంకెందుకు ఆలస్యం అనుకుంటూ అతిధులు వడ్డించినవాటిని మొత్తం తినేస్తున్నాయి. ఎప్పుడు తిన్నాయో ఏంటో అన్ని ఆరగించేస్తున్నాయి. అదేంటి గోశాలలో పశువులు కదా ఉండేది అక్కడ పెళ్లి విందు ఏంటి అనేగా.. అవునండీ అక్కడ.. పెళ్లి విందు ఆరగిస్తుంది కూడా పశువులే.. తమ పెళ్లి కానుకగా మూగ జీవాలకు పెళ్లి విందును ఏర్పాటు చేశారు నెల్లూరు కు చెందిన ఓ యువజంట. ఇక ఈ పెళ్లి విందు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాలలోకి వెళితే..

గతేడాది నుండి కరోనా దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఎన్నో రంగాలు ఈ మహమ్మారి దాడికి కుదేలయ్యాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారు. ఇక మనుషులతో పాటు ఈ కష్టకాలంలో ఉన్న జంతువులను ఎవరు పట్టించుకోవడం లేదు. తిండి లేక అవి రోడ్డుమీదనే ప్రాణాలు వదిలేస్తున్నాయి. ఇక వీటి బాధను అర్ధం చేసుకున్న నెల్లూరుకు చెందిన ఓ యువజంట కష్టకాలంలో వాటికి తిండిని అందజేశాయి. తమ పెళ్లి కి ఖర్చయ్యే కొంత మొత్తాన్ని పశువులకి తిండి పెట్టడానికి ఉపయోగించారు.

https://twitter.com/S_K_Raman/status/1401202746095804424?s=20

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న నిఖిల్ – రక్షల వివాహం ఇటీవల అంగరంగ వైభవంగాజరిగింది. ఈ సందర్భంగా నూతన వధువరులు జిల్లాకు చెందిన జంతు సంరక్షణ శాలలో మూగ జీవాలకు రూ.65వేలతో పెళ్లి విందును ఏర్పాటు చేశారు. జంతు సంరక్షణశాలలో ఉన్న గోవులు, వానరం, కోళ్లు, కుందేళ్లు ఇలా అన్నీ మూగ జీవాలకు ఆహారాన్ని అందించారు. మూగజీవాలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి విందు నెట్టింట్లో వైరల్ గా మారింది. వీరిని జంతు ప్రేమికులు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News