పుట్టి మునిగి మరొకరు గల్లంతు
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిధిలో తుంగభద్ర నదిలో పుట్టి మునిగి యువకుడు గలంతయ్యాడు. వివరాళ్లోకి వెళితే… జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లకు చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో నిన్న అర్ధరాత్రి పుట్టిలో నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో రవికుమార్ అనే యువకుడు గలంతు కాగా, మరో ఇద్దరు యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు గల్లంతైన రవికుమార్ కోసం పోలీసులు […]
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పరిధిలో తుంగభద్ర నదిలో పుట్టి మునిగి యువకుడు గలంతయ్యాడు. వివరాళ్లోకి వెళితే… జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం తుమ్మిళ్లకు చెందిన ముగ్గురు యువకులు తుంగభద్ర నదిలో నిన్న అర్ధరాత్రి పుట్టిలో నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో పుట్టి మునిగిపోయింది.
ఈ ప్రమాదంలో రవికుమార్ అనే యువకుడు గలంతు కాగా, మరో ఇద్దరు యువకులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. విషయం తెలసుకున్న పోలీసులు గల్లంతైన రవికుమార్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసుపుల గ్రామం శ్రీ దత్త వల్లభాపురం సమీపంలోని కృష్ణా నదిలో ప్రమాదవశాత్తు పుట్టి మునిగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలసిందే.