పండగకు ఇంటికి వచ్చి వ్యక్తి మృతి.. ఆగ్రహంతో ఊగిపోయిన గిరిజనులు
దిశ, జడ్చర్ల: జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న తుమ్మల కుంట తండా లోఓల్టేజీ సమస్య కారణంగా తండా మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ సంఘటన మంగళవారం జడ్చర్ల మండలంలోని తుమ్మలకుంట తండా లో జరిగింది. ఈ ఘటనలో ఓ గిరిజనుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. గిరిజనులు పోచమ్మ అమ్మవారి పండుగ నిర్వహణలో భాగంగా బతుకుదెరువు కోసం బయటి ప్రాంతాలకు వెళ్లిన్నారు. మంగళవారం తిరిగి గిరిజనులు తమ సొంత […]
దిశ, జడ్చర్ల: జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ సమీపంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ ప్రాజెక్టు సమీపంలో ఉన్న తుమ్మల కుంట తండా లోఓల్టేజీ సమస్య కారణంగా తండా మొత్తానికి షార్ట్ సర్క్యూట్ అయింది. ఈ సంఘటన మంగళవారం జడ్చర్ల మండలంలోని తుమ్మలకుంట తండా లో జరిగింది. ఈ ఘటనలో ఓ గిరిజనుడు మృతి చెందాడు.
వివరాల్లోకి వెళితే.. గిరిజనులు పోచమ్మ అమ్మవారి పండుగ నిర్వహణలో భాగంగా బతుకుదెరువు కోసం బయటి ప్రాంతాలకు వెళ్లిన్నారు. మంగళవారం తిరిగి గిరిజనులు తమ సొంత గ్రామాలకు వచ్చారు. ఈ క్రమంలో తమ ఇళ్లను శుద్ధి చేసుకునే క్రమంలో లోఓల్టేజీ కారణంగా తండాలోని మొత్తం ఇండ్లకు షాక్ కొట్టడంతో.. తండాలో గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తన ఇంటిని శుద్ధి చేస్తున్న ఇస్లావత్ క్రిష్ణ నాయక్(46) విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తండాలో చిన్న ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో తండావాసులు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. కానీ ఉదండాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులు చేస్తున్న లేబర్ కూలీల గుడిసెల కోసం సంబంధిత కాంట్రాక్టర్ తండా నుంచి ప్రత్యేకంగా విద్యుత్ వైర్ లాగి గుడిసెలకు విద్యుత్ వినియోగించడం జరిగింది.
దీంతో ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్‌లో ఓల్టేజీతో విద్యుత్ సరఫరా అయి తండా మొత్తానికి విద్యుత్ షాక్ కొట్టిందని గిరిజనులు అన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే తండాలో విద్యుత్ షాక్‌తో కృష్ణ నాయక్ మృతిచెందాడని గిరిజనులు ఆరోపించారు. బతుకుదెరువుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పండగల కోసం వచ్చి, విద్యుత్ ప్రమాదంలో కృష్ణ నాయక్ మృత్యువాత పడడంతో తండాలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద అయిన మృతుడు కృష్ణ నాయక్‌కు భార్య నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన క్రిష్ణ నాయక్ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ తండాకు సరఫరా అయ్యే విద్యుత్‌ను ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కూలీలు, గుడిసెలకు ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ విద్యుత్ లైన్ లాగడం పట్ల ఆగ్రహించిన తండావాసులు ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపివేసి వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సీఐ రమేష్ బాబు తెలిపారు.