మెహుల్ చోక్సీకి మరో షాక్.. బెయిల్ తిరస్కరించిన కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో షాక్ తగిలింది. డొమినికా మేజిస్ట్రేట్‌లో బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్న చోక్సీ పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. ఇదే విషయంపై చోక్సీ లాయర్ విజయ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ఇదే కేసు విషయంలో చోక్సీని భారత్‌కు అప్పగించాలని బుధవారం డొమినికా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పట్టించుకోవద్దని విచారణ సందర్భంగా కోర్టుకు […]
దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి మరో షాక్ తగిలింది. డొమినికా మేజిస్ట్రేట్‌లో బెయిల్ కోసం ధరఖాస్తు చేసుకున్న చోక్సీ పిటిషన్‌ను తిరస్కరించింది న్యాయస్థానం. ఇదే విషయంపై చోక్సీ లాయర్ విజయ అగర్వాల్ మాట్లాడుతూ.. ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ఇదే కేసు విషయంలో చోక్సీని భారత్‌కు అప్పగించాలని బుధవారం డొమినికా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆయన విజ్ఞప్తిని పట్టించుకోవద్దని విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో గురువారం మరోసారి విచారించిన మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ధరఖాస్తును తిరస్కరించింది.