స్కామ్ యాప్‌లను గుర్తించిన చిన్నారి మీకు తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు కొత్త కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఏవీ నకిలీవో… ఏవీ ఒరిజనలో తేల్చుకోలేనంతగా సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్స్ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి కంప్లయింట్ ఆధారంగా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌కు చెందిన 7 యాడ్‌వేర్ స్కామ్ యాప్స్‌ను గుర్తించారు. దీని వల్ల కోట్లాది రూపాయలు ఆయా టెక్ సంస్థలకు లాభం చేకూరింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఎప్పటికప్పుడు మాల్‌వేర్, మాలిషియస్ యాప్స్‌లను గుర్తించి […]
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు కొత్త కొత్త యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఏవీ నకిలీవో… ఏవీ ఒరిజనలో తేల్చుకోలేనంతగా సైబర్ నేరగాళ్లు ఫేక్ యాప్స్ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ చిన్నారి కంప్లయింట్ ఆధారంగా గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌కు చెందిన 7 యాడ్‌వేర్ స్కామ్ యాప్స్‌ను గుర్తించారు. దీని వల్ల కోట్లాది రూపాయలు ఆయా టెక్ సంస్థలకు లాభం చేకూరింది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఎప్పటికప్పుడు మాల్‌వేర్, మాలిషియస్ యాప్స్‌లను గుర్తించి తొలగిస్తున్నారు. ఇది రెగ్యులర్‌గా జరిగే చర్యనే. ఇలా యాప్స్ భద్రతపై ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సైబర్ నేరగాళ్ల ముప్పు మాత్రం తప్పడం లేదు. తాజాగా ఏడు యాడ్ వేర్ స్కామ్ యాప్స్ గుర్తించారు. ఈ యాప్స్‌ను 2.4 మిలియన్స్ టైమ్స్ డౌన్‌లోడ్ చేశారు. ఈ యాప్స్ ద్వారా ఇప్పటివరకు 5 లక్షల డాలర్లు ( రూ.3.7 కోట్లు) దోచేశారు.
ప్రధానంగా చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్స్‌ను రూపొందించారు. వాల్‌పేపర్, మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్ ముసుగులో ఇవి ఉంటాయి. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా యాప్స్‌లో ఎంతోమంది సెలెబ్రిటీలు ఇతర యూజర్లు కూడా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేయడం గమనార్హం. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో ఈ మోసపూరిత యాప్స్‌కు సంబంధించిన ప్రకటను ప్లే అవుతాయి. టిక్‌టాక్‌లో ఇలాంటి యాడ్స్ చూసిన ప్రాగ్‌కు చెందిన ఓ చిన్నారి.. ‘అవాస్ట్ బీ సేఫ్ ఆన్‌లైన్ ప్రాజెక్ట్’కు ఫిర్యాదు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా అవాస్ట్ ఆన్‌లైన్‌లో ఎంత జాగ్రత్తగా ఉండాలో చిన్నారులకు అవగాహన కల్పిస్తూ.. క్లాసులు చెబుతోంది. ఆ చిన్నారి కంప్లయింట్ చేయడంతో యాడ్ స్కామ్ యాప్స్ గురించి తెలిసింది. ఇవి సాధారణంగా ఎవరికీ కనిపించకుండా మాల్‌వేర్ ద్వారా లోప్రొఫైల్ మెయిన్‌టెయిన్ చేస్తాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న గూగుల్ వెంటనే ప్లేస్టోర్ నుంచి ఈ యాప్స్‌ను తొలగించింది. కాగా, దీనిపై యాపిల్ ఇంతవరకు స్పందించలేదు. ఇలాంటి ఫేక్ యాప్‌లపై యూజర్లు జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.