HYD: ఆంటీతో స్నేహితుడి ఎఫైర్.. వద్దని చెప్పినందుకు హోటల్‌కి పిలిచి..
దిశ, చార్మినార్ : వివాహితతో ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పిన స్నేహితుడిని కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచిన ఘటన పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా నివసించే అక్బర్‌ఖాన్(23) కు రియాసత్ నగర్‌కు చెందిన ఓ వివాహితతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అక్బర్‌కు రియాసత్ నగర్‌కు చెందిన మహ్మద్ ఆలీ ఈసా(23) స్నేహితుడు. ఈ […]
దిశ, చార్మినార్ : వివాహితతో ప్రేమ వ్యవహారం వద్దని నచ్చజెప్పిన స్నేహితుడిని కత్తితో విచక్షణ రహితంగా దాడిచేసి గాయపరిచిన ఘటన పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. సంతోష్ నగర్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా నివసించే అక్బర్‌ఖాన్(23) కు రియాసత్ నగర్‌కు చెందిన ఓ వివాహితతో గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అక్బర్‌కు రియాసత్ నగర్‌కు చెందిన మహ్మద్ ఆలీ ఈసా(23) స్నేహితుడు. ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం వివాహిత భర్త ‘నీ స్నేహితుడు అక్బర్నా భార్యకు, నాకు ఫోన్లు చేసి వేధిస్తున్నాడని పద్దతి మార్చుకోమని లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని మహ్మద్ ఆలీ ఈసాను హెచ్చరించారు. ఈ విషయమై అక్బర్‌కు ఆ ప్రేమ వ్యవహారం జోలికి పోవద్దని మహ్మద్ ఆలీ ఈసా చెప్పాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. రెండు నెలల నుంచి ఇద్దరి మధ్య మాటలు కూడా లేవు. మరో సారి వివాహిత భర్త మంగళవారం సాయంత్రం మహ్మద్ ఆలీ ఈసాకు ఫోన్ చేశాడు.
నీకు.. నీ స్నేహితుడుకి ఇంకా ఎన్ని సార్లు చెప్పాలే? ఇంకోసారి రియాసత్ నగర్లోకి వస్తే నీది.. నీదోస్త్ అంతు చూస్తానని హెచ్చరించాడు. దీంతో నువ్వు అక్బర్ ఏమన్నా చేసుకోరి .. నా దగ్గరికి వస్తే బాగుండదని ఆలీ ఈసా కూడా వివాహిత భర్తను హెచ్చరించాడు. వెంటనే మహ్మద్ ఆలీ ఈసా అక్బర్‌కు ఫోన్ చేశాడు. నీ వ్యవహారం కారణంగా నన్ను తిడుతున్నారని.. ఇద్దరి మధ్య ఫోన్లో మరోసారి వాగ్వివాదం తలెత్తింది. నేను రియాసత్ నగర్ డికాషన్ హోటల్‌కు వస్తున్నానంటూ అక్కడికి రమ్మని మహ్మద్ ఆలీ ఈసాకు చెప్పాడు అక్బర్. దీంతో చెప్పిన దాని ప్రకారం అక్బర్ తన ప్రియురాలితో కలిసి బైక్‌పై ఈసా దగ్గరికి వచ్చాడు. ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తింది.
దీంతో అక్బర్ పైప్‌తో ఈసా తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అతని దగ్గర నుంచి ఈసా పైప్‌ను గుంజుకున్నాడు. వెంటనే అక్బర్ తన వెనుక జేబులో ఉన్న కత్తితో ఈసాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఈసాకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా అక్బర్‌పై మాదన్నపేట్‌లో అత్యాచార కేసు, మరో చోరీ కేసులు ఉన్నాయని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ నగర్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.