పట్టాలెక్కనున్న మరికొన్ని రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించినందున దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం మరికొన్ని రైల్వే సర్వీసులకు అనుమతిస్తామని గురువారం రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల కేంద్రాల్లో శుక్రవారం నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో కూడా టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మార్చి 23 అర్ధరాత్రి నుంచి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో […]

Update: 2020-05-21 06:05 GMT

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తి నెమ్మదించినందున దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం మరికొన్ని రైల్వే సర్వీసులకు అనుమతిస్తామని గురువారం రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల కేంద్రాల్లో శుక్రవారం నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. వచ్చే రెండు, మూడు రోజుల్లో రైల్వేస్టేషన్లలోని కౌంటర్లలో కూడా టికెట్లు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మార్చి 23 అర్ధరాత్రి నుంచి దేశం లాక్‌డౌన్‌లోకి వెళ్లడంతో రైల్వే, మెట్రో, విమాన సేవలను నిలిపి వేసిన విషయం విధితమే. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడానికి ఈ నెల మొదటి వారంలో శ్రామిక్ రైళ్లు నడిపారు. గత వారం 200 రైళ్లకు అనుమతించారు. వచ్చే నెల నుంచి ప్యాసింజర్ రైళ్లను సైతం నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. లాక్‌డౌన్‌కు ముందు దేశవ్యాప్తంగా ప్రతిరోజు 12000 రైళ్లు నడిచేవి.

Tags:    

Similar News