ఇటుకలతో కరోనాపై అవగాహన

దిశ, వెబ్ డెస్క్: ప్రవీణ్ కేశ్వన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన వాట్సాప్ నెంబర్ కు వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోంది. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అనేది ఇటుకల ఆధారంగా ఓ పిల్లవాడు తనతో ఉన్న మిగతా పిల్లలకు అద్భుతంగా అవగాహన కల్పించాడు. These kids are teaching how #Covid19 spreads. Local ingenuity at best. Via Whatsapp. pic.twitter.com/SF0fvrEtQ8 — […]

Update: 2020-04-16 05:56 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రవీణ్ కేశ్వన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి తన వాట్సాప్ నెంబర్ కు వచ్చిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరలవుతోంది. కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అనేది ఇటుకల ఆధారంగా ఓ పిల్లవాడు తనతో ఉన్న మిగతా పిల్లలకు అద్భుతంగా అవగాహన కల్పించాడు.

మొదటగా కొన్ని ఇటుకలను నిలువు వరుసలో వృత్తాకారంలో నిలబెట్టాడు. ప్రతి రెండు ఇటుకల మధ్య కొంత గ్యాప్ వచ్చేలా నిలబెట్టాడు. అనంతరం ఆ వరుసలోని ఒక ఇటుకను కిందపడేశాడు. దీంతో మిగతా ఇటుకలన్నీ ఒకదానిపై మరొకటి పడుతూ వరుసగా కింద పడిపోయాయి. కరోనా వైరస్ కూడా ఈ విధంగానే ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ఆ పిల్లలకు అవగాహన కల్పించాడు. దీంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. అది చూసిన నెటిజన్లు అద్భుతంగా వివరించాడంటూ ఆ పిల్లవాడిని ప్రశంసిస్తున్నారు.

Tags: Corona, bricks, virus, small children, social media, IFS officer

Tags:    

Similar News