ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై కేసు నమోదు.. ఎక్కడంటే ?

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఎంపీ అసదుద్దీన్‌పై కేసు నమోదయ్యింది. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు. గురువారం కాట్ర చందనలో సభ నిర్వహించారు. ఆ సభలో మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వాధినేతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఉత్తర్ […]

Update: 2021-09-10 01:56 GMT
Asaduddin owaisi interesting comments on Chanchalguda jail
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : యూపీలో ఎంపీ అసదుద్దీన్‌పై కేసు నమోదయ్యింది. మత సామరస్యానికి భంగం కలిగించే విధంగా ఉపన్యాసం చేశారంటూ ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఒవైసీ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నారు. గురువారం కాట్ర చందనలో సభ నిర్వహించారు. ఆ సభలో మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రభుత్వాధినేతలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు పలు సెక్షన్ల కింది ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు బారాబంకి పోలీస్ సూపరింటెండెంట్, యమునా ప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News