కడెం ప్రధాన కాలువలో బాలుడి గల్లంతు

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి తొమ్మిదేళ్ల ఏళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. ఘటన వివరాల్లోకి వెళితే….కడెం మండల కేంద్రానికి చెందిన పసుపుల వెంకన్న కుమారుడు పసుపుల నిఖిల్ ఆనంద్( 9) దస్తూరబాద్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రమాదవ శాత్తు శనివారం అతను కాలువలో పడిపోయాడు. కాగా ప్రధాన కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆనంద్ కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కడెం ప్రాజెక్టు […]

Update: 2020-11-07 07:40 GMT

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కడెం ప్రాజెక్టు ప్రధాన కాలువలో పడి తొమ్మిదేళ్ల ఏళ్ల బాలుడు గల్లంతు అయ్యాడు. ఘటన వివరాల్లోకి వెళితే….కడెం మండల కేంద్రానికి చెందిన పసుపుల వెంకన్న కుమారుడు పసుపుల నిఖిల్ ఆనంద్( 9) దస్తూరబాద్ గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. ప్రమాదవ శాత్తు శనివారం అతను కాలువలో పడిపోయాడు.

కాగా ప్రధాన కాలువ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆనంద్ కొట్టుకుపోయినట్లు కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు కడెం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చి నీటి విడుదలను నిలిపి వేశారు. గజఈతగాళ్ల సహాయంతో పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. కాగా కాలువ గట్టున ఆడుతూ కాలువలో బాలుడు పడిపోయి ఉంటాడనీ లేదా కాలక‌ృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి ప్రమాదానికి గురై కాలువలో బాలుడు పడి ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

Tags:    

Similar News