Rain Alert: వాతావరణ శాఖ కీలక సూచన.. రాబోయే 48 గంటల్లో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!

రాబోయే 48 గంటల వ్యవధిలో తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) వెల్లడించింది.

Update: 2024-09-27 03:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే 48 గంటల వ్యవధిలో తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ (Hyderabad Meteorological Department) వెల్లడించింది. హన్మకొండ, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులు ఇప్పటకే ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేశారు. 


Similar News