Rain Alert:రాష్ట్ర ప్రజలకు రెయిన్ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

రాష్ట్ర ప్రజలకు వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల తెలంగాణలో వర్షాలు(Rains) కురుస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-28 10:22 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రజలకు వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే పలు చోట్ల తెలంగాణలో వర్షాలు(Rains) కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో రెండు రోజులు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Center) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate rains) కురుస్తాయని తెలిపింది. నేడు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఈ క్రమంలో ఆది, సోమవారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదయ్యే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు(thunder), మెరుపులతో వర్షాలు పడే ఛాన్స్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు సూచించారు.


Similar News