తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం.. హైదరాబాద్‌లో పలుప్రాంతాలకు వర్షసూచన
ఫెంగల్ తుఫాను కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.
దిశ, వెబ్ డెస్క్: ఫెంగల్ తుఫాను కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాన్ ప్రభావం కాస్త తగ్గిన కొద్ది గంటలకే.. తూర్పు అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడింది. అలాగే ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా తోడైంది. దీంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే గత మూడు రోజులుగా మేఘావృతం అయిన హైదరాబాద్ నగరం.. తాజా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ఏర్పడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే గత మూడు రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.