దానా తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో ఆ రెండు జిల్లాలకు భారీ వర్షాలు

తూర్పు, మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా, ఆ తర్వాత తుఫానుగా మారింది.

Update: 2024-10-23 11:50 GMT

దిశ, వెబ్ డెస్క్ : తూర్పు, మధ్య బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండగా, ఆ తర్వాత తుఫానుగా మారింది. కాగా ఐఎండీ ఈ తుఫానుకు "దానా"(Dana) అని నామకరణం చేసింది. దానా తుఫాను గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ(Department of Meteorology) అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాను ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో దానా తుఫాన్ ఎఫెక్ట్ రెండు ఉమ్మడి జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుండి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని తెలిపింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో తెలిపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నట్టు తెలిపిన వాతావరణ కేంద్రం.. ఆయా జిల్లాలకు శని, అదివారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.   


Similar News