మేడమ్! 40 ఏళ్ల నన్ను గ్రామంలో ఒకరిద్దరు బలవంతంగా లొంగదీసుకున్నారు.. ఇప్పుడు..!!

మేడమ్! నా వయస్సు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబ పరిస్థితుల కారణంగానే వద్దనుకున్నాను. మేం మొత్తం ఐదుగురం.

Update: 2024-11-02 14:58 GMT

మేడమ్! నా వయస్సు 40 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. కుటుంబ పరిస్థితుల కారణంగానే వద్దనుకున్నాను. మేం మొత్తం ఐదుగురం. నాకు ముగ్గురు అక్కలు, ఒక అన్నయ్య ఉన్నారు. రెండో అక్కకు పాప ఉంది. భర్త వదిలి వేయడం వల్ల అక్క కూతురుని మేమే పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాం. నాన్న ఇంటిని పట్టించుకునే వారు కాదు. అలా చిన్న వయసు నుండే చదువు మానేసి వ్యవసాయం చేస్తున్నాను. ఇప్పుడు నాన్న చనిపోయారు. ప్రస్తుతం అన్నయ్య, అక్క, అమ్మతో కలిసి ఉంటున్నాం. మా వాళ్లు నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. నేను 30 సంవత్సరాల వయస్సు వరకు పరాయి స్త్రీల జోలికి వెళ్లలేదు. ఆ తర్వాత మా గ్రామంలో ఒకరిద్దరు నన్ను బలవంతంగా లొంగదీసుకున్నారు. ఈ మధ్య కాలం దాకా వారి బలవంతంతోనే కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు అలాంటివి మానేశాను. ఒక సంవత్సరం నుండి అంగం సరిగా గట్టిపడటం లేదు. కుడివైపు బీజం కొద్దిగా లావుగా ఉండి, నొప్పిగా ఉంటోంది. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా? నాకు జీవితంలో తోడు కావాలనుకుంటున్నా. సెక్స్ స్పెషలిస్ట్‌ని కలవాలనుకుంటున్నాను. ఎవరిని కలిస్తే బాగుంటుంది?- ఎమ్.బి.టి., వరంగల్

మీరు అనవసరమైన కారణాలతో అర్థం లేని నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. సరైన సమయంలో పెళ్లి చేసుకోవాలి. సరే, బాధ్యతలు నిర్వహించిన వెంటనే వివాహం చేసుకోవాల్సింది. పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాల్లోకి వెళ్ళారు. ఇప్పుడు తోడు కావాలనుకుంటున్నారు. సమస్య వచ్చినప్పుడు కృంగి పోవాల్సిన అవసరం లేదు. మీరు పెనైట్ & స్క్రోటల్ కలర్ డాప్లర్ టెస్ట్, యూఎస్ఓ అబ్డోమెన్, ఆర్బీఎస్, ఇసీజీ, టీఎస్చ్, కిడ్నీ- లివర్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ టెస్ట్ చేయించుకోవాలి. ఎవరైనా మంచి సెక్సాలజిస్ట్ ని కలవండి. పెళ్లికి ముందే పై పరీక్షలు చేయించుకుని లోపముంటే చికిత్స తీసుకుని వివాహం చేసుకోగలరు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Tags:    

Similar News