హస్తప్రయోగం చేస్తుంటే ఫ్రెన్యులం తెగింది.. నేను పెళ్లికి పనికి వస్తానా?
మేడం! నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. హస్తప్రయోగం (Masturbation) చేస్తుంటే ఫ్రెన్యులం (frenulum) తెగింది.

మేడం! నాకు పెద్ద సమస్య వచ్చి పడింది. హస్తప్రయోగం (Masturbation) చేస్తుంటే ఫ్రెన్యులం (frenulum) తెగింది. తర్వాత రక్తస్రావమైంది. దాంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాను. చికిత్స తీసుకున్న. కానీ, ఆందోళన తగ్గ లేదు. అంగస్తంభన(erectile dysfunction)లు తగ్గాయి. ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. నేను పెళ్లికి పనికి వస్తానా? -ఎస్.ఎన్., కర్నూలు (ఇ-మెయిల్ ద్వారా)
మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. ఇది చాలా చిన్న సమస్య. మిడిమిడి జ్ఞానంతో మీలో మీరే కృంగిపోతే సమస్య ఎక్కువవుతుంది తప్ప ఉపయోగం ఉండదు. ఫ్రెన్యులం తెగినంత మాత్రాన అంగస్తంభన సమస్య రాదు. అది కేవలం మీ మానసిక ఆందోళన వల్లనే నైట్రిక్ ఆక్సైడ్ (Nitric oxide) విడుదల కాదు. విపరీతమైన మానసిక ఒత్తిడివల్ల అంగంలోకి రక్తం పంప్ కాదు. అంతే తప్ప, ఫ్రెన్యులం కట్ అవడమనే శారీరక కారణం అంగస్తంభనకు దారి తీయదు. అలాగే, ఫ్రెన్యులం కట్ అవ్వాలన్న అపోహ కూడా చాలా మందిలో ఉంది. కట్ అవ్వకపోతే సంసారానికి పనికి రారు అన్నది కేవలం అపోహ మాత్రమే. అంగం కింద ఉండే చర్మపు ముడతే ఫ్రెన్యులం. దీని స్పర్శ ఆనందాన్ని, లైంగికోద్రేకాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు ఇది కట్ అయినప్పుడు రక్తస్రావమౌతుంది. తర్వాత సాధారణ గాయానికి చేసే చికిత్స చేస్తే చక్కగా తగ్గిపోతుంది. ఫ్రెన్యులం కట్ కాకపోయినా సెక్స్ జీవితానికి అవరోధం కాదు. మీరు చక్కగా వివాహం చేసుకోండి. అంగస్తంభన సమస్య ఉంటే ఫ్రెన్యులం కట్ అవడం కారణం కాక ఇంకేమైనా ఇతర శారీరక, మానసిక కారణాలున్నాయా అన్నది మీరు సెక్సాలజిస్ట్ వద్దకు వెళితే తెలిసి పోతుంది. దేనికైనా చికిత్స ఉంది. కాబట్టి, ఆందోళన పడకండి.
READ MORE ...
ఆమెను స్పర్శించగానే స్థలనం అయిపోయింది.. నేను పెళ్లి చేసుకోవాలా, వద్దా?
Sex & Science : హస్తప్రయోగం చేస్తే మొటిమలు వస్తాయా ?
- డాక్టర్ భారతి, MS
మేరిటల్ కౌన్సెలర్
సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్