సిగరెట్, మద్యం.. కోరికలను తగ్గిస్తాయా?

మేడం నా వయసు 23 సంవత్సరాలు. నా భర్తకి 35.

Update: 2025-03-28 05:09 GMT
సిగరెట్, మద్యం.. కోరికలను తగ్గిస్తాయా?
  • whatsapp icon

ప్రశ్న : మేడం నా వయసు 23 సంవత్సరాలు. నా భర్తకి 35. మావారికి సిగరెట్లు, మద్యం బాగా అలవాటు ఉన్నాయి. ఈ మధ్యనే నాకు అబార్షన్ అయింది. మా వారిలో రోజురోజుకి సెక్స్ కోరికలు తగ్గిపోతున్నాయి. మొదట్లో వీర్యం బాగానే వచ్చేది.. కానీ రాను రాను తగ్గిపోతుంది. మావారి నైట్ డ్యూటీ కావడం వల్ల ఇట్లా అవుతోందా ? తనకు ఏమైనా తీవ్రమైన సెక్స్ లోపాలు ఉన్నాయా? దయచేసి పరిష్కారం చెప్పండి.

జవాబు : ముందు వీర్యం త్వరగా బయటకు వస్తుందని రాశావు తర్వాత చాలా ఆలస్యంగా వస్తుందని రాసావు. నీ భర్తకు అంగస్తంభన సమస్యతో పాటు శీఘ్ర స్ఖలన సమస్య ఉందని.. అయితే శీఘ్ర స్ఖలనానికి, నీ అబార్షన్ కి ఏ సంబంధం లేదు. అయితే అంగస్తంభన సమస్యకు నీ సంతానలేమికి సంబంధం ఉంది. నీకు గర్భం వచ్చి నిలవడానికి మీ ఇద్దరు సెక్సాలజిస్ట్ నీ కలవండి. మీ వారు తాగే సిగరెట్లు, ఆల్కహాల్ వల్ల కూడా వీర్య కణాల ఉత్పత్తికి అవసరమైన సెక్స్ హార్మోన్స్ టెస్టోస్టిరాన్ స్థాయి పడిపోయి సెక్స్ కోరికలు, వీర్యకణాలు రెండూ తగ్గిపోతూ ఉంటాయి. మీ వారు ముందు వ్యసనాలకి దూరంగా ఉండాలి. మీరు ఒకసారి సెక్సాలజిస్ట్, మ్యారేజ్ కౌన్సిలర్ ని కలిస్తే మీ సమస్యకి పరిష్కారం ఉంటుంది.

ప్రశ్న: మేడం నా వయసు 20 సంవత్సరాలు నాకు ఈ మధ్యన పెళ్లయింది. నేను కుటుంబ నియంత్రణ మందులు వాడాలనుకుంటున్నాను. అవి వేసుకోవచ్చా? ఎవరెవరు వేసుకోకూడదు?

జవాబు: ఇంత చిన్న వయసులో ఈ మాత్రలు మొదలు పెట్టడం మంచిది కాదు. సహజమైన పద్ధతులు ఉన్నాయి. సేఫ్టీ పీరియడ్స్ తో కండోమ్స్, టుడే వెజినల్ పిల్స్ లాంటివి. అయితే ఈ ఓ.సీ పిల్స్ పూర్తి క్షేమకరం కాదు. వాటిని ఎక్కువ సంవత్సరాలు వాడకూడదు. వాడితే చాలా ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ కింది సమస్యలు ఉన్నవారు కుటుంబ నియంత్రణ మాత్రలు వాడకూడదు. కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని మాత్రమే వాడాలి

  • యాక్టివ్ త్రాంబో ఎంబోలిక్ డిసార్డర్ ( అంటే సిరలలో రక్తం గడ్డ కట్టి విడిపోయి రక్తంలో ప్రవహించి రక్త ప్రసరాన్ని అడ్డుకునే వ్యాధి)
  • తీవ్రమైన లివర్ లేదా కాలేయ వ్యాధులు ఉన్నవారు.
  • ప్రొజెస్టరాన్ హార్మోన్ ఆధారిత గడ్డలు ఉన్నవారు.
  • వెజైనా నుంచి కారణం తెలియని రక్తస్రావం అవుతున్నవాళ్లు.
  • డయాబెటిక్ రెటినోపతి, న్యూరోపతి ఉన్నవాళ్లు.
  • రక్తం గడ్డ కట్టడంలో సమస్యలు ఉన్నవారు.
  • వెరికోసిల్ వెయిన్స్ ఉన్నవాళ్లు.

Similar News