విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama).

Update: 2025-03-19 09:01 GMT
విడుదలైన నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్న రొమాంటిక్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పవిష్, అనిఖా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’(Jabilamma Neeku Antha Kopama). కోలీవుడ్ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ ధనుష్(Dhanush) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా యూత్‌ను బాగా అలరించింది. ఇక ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్‌ సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లో రిలీజ్‌ చేశారు.

అయితే పవిష్ నారాయణ్‌(Pavish Narayan) తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకున్నా హీరోయిన్స్ అనిఖా సురేంద్రన్‌(Anikha Surendran), ప్రియా ప్రకాష్ వారియర్‌(Priya Prakash Varrier)లు సుపరిచితులే. అందుకే ఈ మూవీకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్‌ను అలరించిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

ఇందులో భాగంగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో(amazon Prime Video) సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చింది. ఈనెల 21 నుంచి ఈ సినిమాను ఓటీటీ(OTT)లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది. మరి ఇంకెందుకు ఆలస్యం థియేటర్లలో చూడని వారు ఎల్లుండి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని చూసేయండి.

Read More..

ఇది కదా సూపర్ స్టార్ రేంజ్ అంటే.. అన్ని కోట్లతో ‘కూలీ’ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్లాట్‌ఫామ్(పోస్ట్)

Tags:    

Similar News