1000 CC కెమెరాలు, 7 వేల మంది భద్రతా సిబ్బంది.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట రెడీ

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద ఏడు వేల మంది భద్రత సిబ్బందితో నాలుగు అంచెల భద్రతను

Update: 2023-08-14 05:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబైంది. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఎర్రకోట వద్ద ఏడు వేల మంది భద్రత సిబ్బందితో నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మినిట్ టూ మినిట్ మానిటరింగ్ చేసేలా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో 1000 సీసీ కెమెరాలతో పాటు మరో 16 ఏఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాని మోడీ, ఇతర అగ్ర నాయకులు ఎర్రకోటకు రానున్న నేపథ్యంలో భద్రతా విధుల్లోకి కేంద్ర పారా మిలటరీ బలగాలను దింపారు.

ఇక, ప్రధాని నరేంద్ర మోడీ 10వ సారి ఎర్రకోటపై జాతీయ జెండా ఎగర వేసి ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలతో పాటు.. మరికొన్ని నెలల్లో దేశంలో ఎన్నికలు జరగనుండటంతో కొత్త పథకాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్రం ప్రతి రాష్ట్రం నుండి 90 జంటలకు ఆహ్వానం పంపించింది. వీరందరికి సంప్రదాయ దుస్తుల్లో రావాలని సూచనలు చేసింది.


Similar News