మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీకి గుండె నొప్పి.. వీడియో వైరల్

ఐపీఎల్ 18వ సీజన్‌లో విరాట్ కోహ్లీ భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఓపెనర్ గా ఆర్సీబీ జట్టుకు పరుగుల వరద పారిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Update: 2025-04-14 07:38 GMT
మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీకి గుండె నొప్పి.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 18వ సీజన్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) భీకర ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఓపెనర్ గా ఆర్సీబీ (RCB) జట్టుకు పరుగుల వరద పారిస్తూ.. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఈ సీజన్ లో ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో నాలుగు విజయాలను అందుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న ఆర్సీబీ జట్టు ఒక్కసారి కూడా కప్పు సాధించలేకపోవడంతో.. ఈ సీజన్ లో కప్పు కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకు అనుగుణంగానే జట్టు ప్రదర్శన కనబరుస్తుంది. దీంతో ఈ సీజన్ లో ఆర్సీబీ కప్పు కొట్టడం ఖాయం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో ఆర్సీబీ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచులో బెంగళూరు జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అయితే రెండో ఇన్నింగ్స్ లో 174 పరుగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లీ, సాల్ట్ లు మంచి ఆరంభాన్ని అందించారు. అనంతరం సాల్ట్ అవుట్ అయినప్పటికి కోహ్లీ బ్యాటింగ్ లో కొనసాగాడు. ఈ క్రమంలో ఓ బంతికి కోహ్లీ రెండు పరుగులు తీసిన అనంతరం గుండెలో నొప్పి (heart pain) అంటూ శాంసన్ కు చెప్పడం ఆందోళనకరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో కోహ్లీ చాతి పై చేయి పెట్టుకొని నొప్పిగా ఉందని, శాంసన్‌తో పాటు ఆర్సీబీ ఫిజికల్ డిపార్ట్మెంట్ కు చెప్పడం కనిపించింది. దీంతో ఫిజికల్ డైరెక్టర్లు హుటాహుటిన మైదానంలోకి వచ్చి కోహ్లిని పరిశీలించారు. అనంతరం ఆయన డ్రింక్స్ ఇచ్చి.. కాసేపటి రెస్ట్ తర్వాత వెళ్లిపోయారు. దీంతో కోహ్లీ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లీ 45 బంతుల్లో 62 పరుగులు చేశాడు. ఎక్కువ శాతం సింగల్స్, డబుల్స్ మాత్రమే తీయడంతో జైపూర్ వాతావరణ పరిస్థితుల వల్ల ఆయన అలసట గా ఫీల్ అయినట్టు నివేదికలో తెలిపారు.

Tags:    

Similar News