ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డు

T20 ప్రపంచ కప్ 2024 లో స్థానం దక్కించుకున్న యువ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు.

Update: 2024-05-25 09:58 GMT

దిశ, వెబ్ డెస్క్: T20 ప్రపంచ కప్ 2024 లో స్థానం దక్కించుకున్న యువ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం చెన్నైలో చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్ 2 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో చహల్ బారీ స్కోరును సమర్పించుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో తన బౌలింగ్‌లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా వెటరన్ లెగ్ స్పిన్నర్ గా చహల్ నిలిచాడు. కెరీర్ మొదట్లో ముంబై జట్టుతో స్టార్ట్ చేసిన చహల్ అత్యధిక కాలం ఆర్సీబీ జట్టులో ఆడాడు. ఆ తర్వాత 2022 వేలంలో అతన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు దక్కించుకుంది. అయితే చహల్ తన ఐపీఎల్‌లో మొత్తంలో ఇప్పటి వరకు ఇచ్చిన సిక్సర్ల సంఖ్య 224 కి చేరుకుంది.

ఆ తర్వాత లెగ్ స్పిన్నర్ - పీయూష్ చావ్లా 222 సిక్సర్లను సమర్పించుకుని రెండో స్థానంలో నిలవగా.. రవీంద్ర జడేజా (206), రవిచంద్రన్ అశ్విన్ (202) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు. చాహల్ IPL 2024లో 30 సిక్సర్లను సమర్పించుకున్నాడు. IPL 2022 లో మహ్మద్ సిరాజ్ యొక్క 31 సిక్సర్లను సమర్పించుకుని ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా సిరాజ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే జూ 6 నుంచి టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో జట్టులో స్థానం దక్కించుకున్న చహల్ ఏ మేరకు తిరిగి పుంజుకుంటాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.


Similar News