IPL 2024 : రాజస్థాన్ బౌలర్ల ధాటికి తడబడిన ముంబై.. స్వల్ప స్కోరుకే పరిమితం
ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దారుణంగా తేలిపోయారు.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు దారుణంగా తేలిపోయారు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి తడబడినా ముంబై జట్టు.. రాజస్థాన్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా ముంబై బ్యాటింగ్‌కు దిగింది. రాజస్థాన్ బౌలర్లు మొదటి నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు ఏ దశలోనూ కోలుకోలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(34) టాప్ స్కోరర్. తిలక్ వర్మ(32) పర్వాలేదనిపించాడు. మిగతా వారు దారుణంగా విఫలమయ్యారు. రోహిత్ శర్మ(0), నమన్ ధిర్(0), డెవాల్డ్ బ్రెవిస్(0) ఖాతా తెరకపోవడం గమనార్హం. ఇషాన్ కిషన్(16), టిమ్ డేవిడ్(17) క్రీజులో నిలువలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ముంబై జట్టు 9 వికెట్లను కోల్పోయి 125 పరుగులే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, యుజువేంద్ర చాహల్ మూడేసి వికెట్లతో ముంబైని కట్టడి చేశారు. నాండ్రె బర్గర్ 2 వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టారు.