IPL 2023: పంజాబ్‌కి చెమటలు పట్టించిన RR ఇంపాక్ట్ ప్లేయర్ ధ్రువ్ జురెల్..

Update: 2023-04-06 11:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇంపాక్ట్ ప్లేయర్‌గా రాజస్థాన్ టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ జురెల్‌.. హీరోలా మారిపోయాడు. రాజస్థాన్ టీమ్ ఆశలు వదిలేసిన మ్యాచ్‌లో దాదాపు టీమ్‌ని గెలిపించినంత పనిచేశాడు. పంజాబ్ కింగ్స్‌‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ క్రికెటర్ ధ్రువ్ జురెల్ గౌహతిలో కాసేపు చెమటలు పట్టించేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌‌గా నెం.8లో బ్యాటింగ్‌కి వచ్చిన జురెల్ 15 బంతుల్లోనే 3x4, 2x6 సాయంతో అజేయంగా 32 పరుగులు చేశాడు. దాంతో ఎవరీ ధ్రువ్ జురెల్ అని నెటిజన్లు శోధిస్తున్నారు.

2001లో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పుట్టిన ధ్రువ్ జురెల్.. 2020 అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆడిన భారత్ జట్టులో సభ్యుడు. ఆ టోర్నీలో భారత్ జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. ధ్రువ్ జురెల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. వికెట్ కీపర్ బ్యాటరైన ఈ 22 ఏళ్ల యంగ్ క్రికెటర్ మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తుంటాడు. ఐపీఎల్ 2022 ఆటగాళ్ల వేలంలో రూ.20 లక్షలకి ధ్రువ్ జురెల్‌ని రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ఈ ఏడాది కూడా అదే ధరకి అతడ్ని రిటైన్ చేసుకుంది. అయితే.. తుది జట్టులో మాత్రం ఇంకా అవకాశం ఇవ్వలేదు. ధ్రువ్ జురెల్ ఇన్నింగ్స్‌పై మాత్రం ప్రశంసలు అందుతున్నాయి.

Tags:    

Similar News