ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు
ఐపీఎల్ 2023లో లీగ్ మ్యాచులు ఆదివారంతో ముగిశాయి. చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో లీగ్ మ్యాచులు ఆదివారంతో ముగిశాయి. చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభ్‌మాన్ గిల్ సెంచరీలతో చెలరేగారు. కాగా కీలకమైన మ్యాచ్‌లో కోహ్లీ 60 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఆరు సెంచరీలు బాదిన క్రిస్‌గేల్ రికార్డును కోహ్లీ అదిగమించాడు. ఈ సీజన్‌లో రెండు సెంచరీలు చేసిన కోహ్లీ మొత్తం ఐపీఎల్ లో 7 సెంచరీలతో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డును నమోదు చేశాడు. అలాగే ఒకే సీజన్ లో వరుసగా రెండు సెంచరీలు కొట్టిన మొదటి ప్లేయర్ గా, అలాగే మొదటి RCB ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచారు.