ధోనితో నేను ఆడటం ఇదే చివరి మ్యాచ్ కావోచ్చు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు ధోని, కోహ్లీ జట్టు సీజన్ లీగ్ స్టేజీలో చివరి మ్యాచులో తలపడనున్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా ఈ రోజు ధోని, కోహ్లీ జట్టు సీజన్ లీగ్ స్టేజీలో చివరి మ్యాచులో తలపడనున్నారు. భారత మాజీ కెప్టెన్ అయిన ధోని అన్ని ఫార్మట్లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం ఐపీఎల్ మ్యాచ్ లో మాత్రమే చెన్నై తరపున ఆడుతున్నారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా ధోనికి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని.. అందుకే చెపాక్ స్టేడియం లో జరిగిన మ్యాచుల్లో తమ అభిమానులకు వీడ్కోలు పలికారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ రోజు ఉదయం ప్రాక్టీస్ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ధోనీతో కలిసి ఆడుతున్న. బహుశా.. మేమిద్దరం కలిసి ఆడే మ్యాచ్ ఇదే చివరిది కావచ్చు.. అతను ఐపీఎల్ లో కొనసాగుతాడో.. లేదో.. ఎవరికి తెలుసు అన్నాడు.
అలాగే ఈ రోజు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్ కు అద్భుతమైన అనుభూతి ఇస్తుందన్నారు. మేం ఇద్దరం కలిసి భారత జట్టుకు చాలా ఏళ్లు ఆడాం.. ఇద్దరం కలిసి జట్టును అనేకసార్లు గెలిపించాం అని చెప్పుకొచ్చారు. దీంతో విరాట్ ధోని ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నాడని వస్తున్న వార్తలకు బలం చేకూర్చారు. దీంతో చెన్నై అభిమానుల్లో తీవ్ర కలవరం మొదలైంది. మరోపక్క విశ్లేషకులు మాత్రం ధోని చెన్నై తరుఫున సుదీర్ఘంగా ఆడారు. ఐదు సారు చాంపియన్ గా నిలిచారు. ఈ సీజన్ కూడా అన్నీ కలిసొస్తే.. చాంపీయన్ గా నిలిచి ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుని.. సీఎస్కే జట్టుకు మెంటర్‌గా నిలుస్తాడని అంచనా వేస్తున్నారు.