మాటిచ్చి అలా ఎలా చేస్తారు?.. ఆ దేశ క్రికెటర్లపై సునీల్ గవాస్కర్ ఫైర్

ఐపీఎల్-17ను మధ్యలోనే వదిలేసి వెళ్లే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు.

Update: 2024-05-14 13:05 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17ను మధ్యలోనే వదిలేసి వెళ్లే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీఐకి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. జాతీయ జట్టుకు అందుబాటులో ఉండాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఆదేశాల నేపథ్యంలో ఇంగ్లాండ్ ప్లేయర్లు ఒక్కొక్కరుగా ఐపీఎల్‌ను వీడుతున్నారు. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు చెందిన విల్ జాక్స్, రీస్ టోప్లే‌లతోపాటు జోస్ బట్లర్(రాజస్థాన్ రాయల్స్), లివింగ్‌స్టోన్(పంజాబ్ కింగ్స్) ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయారు. ఐపీఎల్‌ మధ్యలోనే లీగ్‌ను వీడటంపై సునీల్ గవాస్కర్‌ ఫైర్ అయ్యాడు.

ప్లేయర్లతోపాటు ఆయా దేశాల బోర్డులపై కూడా చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరాడు. ‘దేశానికి ప్రాధాన్యతనిచ్చే ఆటగాళ్లకు నేను అండగా ఉంటాను. కానీ, పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉంటామని ఫ్రాంచైజీలకు హామీ ఇచ్చి ఇప్పుడు మధ్యలోనే వెళ్లిపోవడం సరైంది కాదు. ఆటగాళ్లు ఫీజు నుంచే కాకుండా ప్లేయర్ల ఫీజు నుంచి వారి బోర్డులకు ఇచ్చే 10 శాతం కమిషన్‌ను కూడా ఆపేయాలి.’ అని తెలిపాడు. మొయిన్ అలీ(చెన్నయ్), బెయిర్‌స్టో(పంజాబ్), సామ్ కర్రన్(పంజాబ్), ఫిల్ సాల్ట్(కోల్‌కతా) కూడా త్వరలోనే ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆటగాళ్లు మధ్యలోనే వెళ్లిపోవడం వల్ల ఆయా జట్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. 

Tags:    

Similar News