అందుకే అలా చేశా.. ధోనీ ఆటోగ్రాఫ్‌పై సునీల్ గవాస్కర్ కామెంట్స్

ఐపీఎల్-16లో చెన్నయ్ సూపర్ కింగ్స్ తన సొంత మైదానం చెపాక్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడేసింది.

Update: 2023-05-16 15:08 GMT

చెన్నయ్: ఐపీఎల్-16లో చెన్నయ్ సూపర్ కింగ్స్ తన సొంత మైదానం చెపాక్‌లో చివరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచే సీఎస్కేకు సొంతగడ్డపై చివరి లీగ్ మ్యాచ్. మ్యాచ్ అనంతరం సీఎస్కే ఆటగాళ్లు పరేడ్ నిర్వహించి అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. అప్పుడు టీమ్ ఇండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన షర్ట్‌పై ఎంఎస్ ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం వెనుక ఉన్న తన ఉద్దేశాన్ని గవాస్కర్ రివీల్ చేశాడు. ‘చెన్నయ్‌కు చెపాక్‌లో ఇది చివరి మ్యాచ్. ఒకవేళ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటే మరో మ్యాచ్ ఆడుతుంది.

కానీ, ఆ క్షణాన్ని ప్రత్యేకంగా గుర్తుండేలా చేయాలనుకున్నా. వెంటనే ధోనీ వద్దకు పరుగెత్తుకెళ్లి నా షర్ట్‌పై ఆటోగ్రాఫ్ కావాలని అడిగాను. అతను ఒప్పుకోవడంతో చాలా సంతోషించా. ఇది నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే, ధోనీ భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు.’ అని గవాస్కర్ తెలిపాడు. అలాగే, టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలిచిన క్షణాలను గవాస్కర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ‘1983లో కపిల్‌ దేవ్ వరల్డ్ కప్ ట్రోఫీ ఎత్తుకోవడం, 2011లో ప్రపంచకప్‌లో ధోనీ విన్నింగ్ సిక్స్ కొట్టడం.. ఈ రెండింటిని నేను చనిపోయే ముందు చూడాలనుకుంటున్నా.’ అని తెలిపాడు.

Tags:    

Similar News