కోహ్లీ, గంభీర్‌కు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు.. ఆ హగ్‌పై సీనియర్ క్రికెటర్ సెటైర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై కోల్‌కతా ఘన విజయం సాధించింది.
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీపై కోల్‌కతా ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్ధేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.5 ఓటర్లోనే ఛేదించింది కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున కోహ్లీ ఒంటరి పోరాటం చేయగా.. కేకేఆర్ జట్టు మొత్తం ఉమ్మడిగా రాణించి విజయం దక్కించుకున్నది. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
ఆర్సీబీ బ్యాటింగ్ సమయంలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో గంభీర్ మైదానంలోకి వచ్చి కోహ్లీని హగ్ చేస్తున్నారు. ఇద్దరూ ఈ సందర్భంగా నవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. దీనిపై భారత సీనియర్ క్రికెటర్లు రకరకాలు స్పందిస్తున్నారు. ఈ ఆలింగనానికి(హగ్) ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి సరదాగా డిమాండ్ చేయగా.. ఫెయిల్ ప్లే మాత్రమే కాదు ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు అని సునీల్ గవస్కార్ సెటైర్ వేశారు. అయితే, గవస్కార్ ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియక ఇద్దరి ఫ్యాన్స్ కన్‌ఫ్యూజన్‌కు గురవుతున్నారు.