ఐపీఎల్ మ్యాచ్ నిషేధం అంచున రిషబ్ పంత్
2022 డిసెంబర్ 31 భారీ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్ దాదాపు సంవత్సరం మొత్తం భారత జట్టుకు, ఐపీఎల్ జట్టుకు దూరం అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్: 2022 డిసెంబర్ 31 భారీ ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడిన రిషబ్ పంత్ దాదాపు సంవత్సరం మొత్తం భారత జట్టుకు, ఐపీఎల్ జట్టుకు దూరం అయ్యారు. అనంతరం గాయాల నుంచి పూర్తిగా కోలుకున్న అతను. 2024 ఐపీఎల్ సీజన్ కు అందుబాటులోకి వచ్చి.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రస్తుతం పంత్ ఐపీఎల్ మ్యాచ్ నిషేధం అంచున ఉన్నాడు. 26 ఏళ్ల పంత్‌పై స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే రెండుసార్లు జరిమానా విధించారు.
ఐపీఎల్ ప్లేయింగ్ కండిషన్స్ ప్రకారం.. స్లో ఓవర్ రేట్‌ను ఉల్లంఘించినందుకు కెప్టెన్‌కు మొదటిసారి రూ.12 లక్షల జరిమానా. రెండవ ఉల్లంఘన కూడా అలానే జరిగితే.. జరిమానా రూ. 24 లక్షలకు రెట్టింపు చేయబడుతుంది. అలాగే జట్టులోని 11 మంది ఆటగాళ్లకు కూడా రూ. 6 లక్షలు లేదా, మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించబడింది. మూడోసారి కూడా అలనే జరిగితే.. మాత్రం 30 లక్షల జరిమానా తో పాటు.. జట్టు కెప్టెన్ పై ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. గతంలో ఇలానే గుజరాత్ కెప్టెన్ హర్దిక్ పాండ్యా.. వరుస మ్యాచుల్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు.