ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినందుకు రిషబ్ పంత్‌కు జరిమానా
ఐపీఎల్ 2024 లో భాగంగా బుధవారం ఢిల్లీ, కలకత్తా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024 లో భాగంగా బుధవారం ఢిల్లీ, కలకత్తా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కలకత్తా జట్టు ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసింది. కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో.. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఢిల్లీ జట్టు చిత్తుగా ఓడిపోయింది. ఇదిలా ఉంటే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్.. ఐపీఎల్ రూల్స్ బ్రేక్ చేసినందుకు బీసీసీఐ జరిమానా విధించింది. ఓ వైపు కలకత్తా బ్యాటర్లు తమ బౌలర్లను ఊచకోత కొయడంతో ఢిల్లీ కెప్టెన్ పంత్ బౌలర్లతో మంతనాలు జరుపుతూ బౌలింగ్ చేయించారు.
దీంతో.. స్లో ఓవర్ రేట్ మెయింటెయిన్ అయింది. ఈ కారణంగా పంత్ కు తన మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించింది. ఇదిలా ఉంటే.. “మినిమమ్ ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL యొక్క ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఈ సీజన్‌లో అతని జట్టుకు ఇది రెండవ ఉల్లంఘన. దీంతో పంత్‌కు INR 24 లక్షల జరిమానా విధించబడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి INR 6 లక్షలు, వారి సంబంధిత మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది.