ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి

ఐపీఎల్ 2024లో ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సంచలన రికార్డులకు వేదిక అయింది.

Update: 2024-04-16 04:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సంచలన రికార్డులకు వేదిక అయింది. బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బౌండరీల వరద పారింది. మొదటి ఇన్నింగ్స్‌లో సన్ రైజర్స్ జట్టు 287 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో ఆర్సీబీ జట్టు 262 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ అరుదైన రికార్డులు నెలకొల్పింది. అందులో ఒకే మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు నమోదు చేశారు. ఇరు జట్లు కలిపి.. ఫోర్లు, సిక్సర్లతో ఏకంగా 81 బౌండరీలు కొట్టారు. వీటిలో 43 ఫోర్లు 38 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు మ్యాచ్‌గా నిలిచిన హైదరాబాద్-మంబై మ్యాచ్(38 సిక్సర్ల) రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో మరో అరుదైన రికార్డు నమోదైంది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి టీ20 చరిత్రలోనే అత్యధికంగా 549 పరుగుల నమోదయ్యాయి.


Similar News