పాండ్యా కెప్టెన్సీ ఇలాగే కొనసాగితే.. : ముంబై కెప్టెన్‌పై మనోజ్ తివారీ ఫైర్
ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంటున్నది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ ఆశలను సంక్లిష్టం చేసుకుంటున్నది. గత మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ముంబై ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ ఫైర్ అయ్యాడు.
రాజస్థాన్‌తో మ్యాచ్ గురించి మాట్లాడుతూ తొలి ఓవర్ బుమ్రాకు ఇవ్వకుండా పాండ్యా వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘బౌలింగ్ లైనప్‌లో బుమ్రా ఉన్నప్పుడు అతనికి తొలి ఓవర్ ఓవర్ ఎందుకు ఇవ్వరు?. గత మ్యాచ్‌లో బట్లర్ సెంచరీ చేశాడు. జైశ్వాల్ ఫామ్‌లో లేడు. అలాంటప్పుడు వికెట్ తీయడానికి అత్యుత్తమ బౌలర్‌కు అవకాశం ఇవ్వాలి. తొలి ఓవర్ వేసిన పాండ్యా రెండు బౌండరీలు ఇచ్చాడు. దీంతో కొత్త బంతికి ఉండే ప్రకాశం, స్వింగ్ కొద్దిగా తగ్గింది. ఇది బ్యాటర్లకు కలిసొచ్చింది.’ అని వివరించాడు.
పాండ్యా కెప్టెన్సీ ఇలాగే కొనసాగితే, ముంబై జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకోవడమ కష్టమేనన్నాడు. ‘గతంలో ఆటగాళ్లు రోహిత్ వెంట ఉండేవాళ్లు. ఇప్పుడు ముంబై ఆటగాళ్లు పాండ్యాను కెప్టెన్‌గా భావించడం లేదనిపిస్తుంది.’ అని తెలిపాడు. కాగా, ముంబై జట్టు పాయింట్స్ టేబుల్‌లో మూడు విజయాలతో 7వ స్థానంలో ఉన్నది. ఈ నెల 27న ఢిల్లీతో తలపడనుంది.