IPL 2023: అంపైర్ నితిన్ మీనన్ అరుదైన ఘనత.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి!
IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ మ్యాచ్ మూడో ఓవర్‌లో అర్జున్ వేసిన నాలుగో బంతి రాహుల్ త్రిపాఠి పక్క నుంచి లెగ్‌స్టంప్ నుంచి వెళ్లింది. అయితే అర్జున్ టెండూల్కర్‌తో పాటు కీపర్ ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్ అంటూ అప్పీల్ చేయగా.. అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. అయితే రోహిత్ శర్మ రివ్యూ తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.
దీంతో అర్జున్, ఇషాన్‌లు సైలెంట్ అయిపోయారు. కానీ అంపైర్ నితిన్ మీనన్ తొలిసారి అంపైర్ రివ్యూను ఉపయోగించాడు. అసలు అది వైడ్ బాల్ అవునా కాదా అనే డౌట్‌తో రివ్యూకు వెళ్లాడు. అల్ట్రాఎడ్జ్‌లో అది క్లియర్ వైడ్ అని తెలిసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒక అంపైర్ డీఆర్‌ఎస్ కోరడం ఇదే తొలిసారి. ఐపీఎల్‌లో ఇంతవరకు ఈ రివ్యూ ఏ అంపైర్ వాడుకోలేదు.