ముంబై కథ ముగిసె.. ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా

ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

Update: 2024-05-08 17:47 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. పేలవ ప్రదర్శనతో నాకౌట్ ఆశలు గల్లంతు చేసుకున్న ఆ ఇప్పటివరకు సాంకేతికంగా పోటీలో ఉంది. అయితే, లక్నోపై హైదరాబాద్ గెలుపొందడంతో ఆ జట్టు అధికారికంగా ఎలిమినేట్ అయ్యింది. ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన మొదటి జట్టుగా ముంబై నిలిచింది. ఈ సీజన్‌లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టు పేలవ ప్రదర్శన చేసింది. 12 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌ల్లో ఓడింది. కేవలం నాలుగింట మాత్రమే నెగ్గి 8 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నది. ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

ఈ నెల 11న కోల్‌కతాతో, 17న లక్నోతో ఆడనుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో కోల్‌కతా, రాజస్థాన్ 16 పాయింట్ల చొప్పున తొలి రెండు స్థానాల్లో ఉండగా.. హైదరాబాద్ 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నది. నాలుగో స్థానం కోసం చెన్నయ్, ఢిల్లీ, లక్నో పోటీపడుతున్నాయి. 12 పాయింట్ల చొప్పున ఉన్న ఈ మూడు జట్లలో ఏ జట్టైనా మరో మ్యాచ్‌లో నెగ్గినా లేదా పాయింట్లు పంచుకున్నా కనిష్టంగా 13 పాయింట్లు పొందుతుంది. ముంబై మిగతా రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా సాధించే పాయింట్లు 12 మాత్రమే. కాబట్టి, ముంబైకి ముందడగు వేసే పరిస్థితి లేదు. 

Tags:    

Similar News