IPL 2023: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ అరుదైన ఘనత..

ఐపీఎల్‌లో షమీ 100 వికెట్ల మైలురాయిని సాధించాడు.

Update: 2023-03-31 15:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో షమీ 100 వికెట్ల మైలురాయిని సాధించాడు. డెవాన్ కాన్వే వికెట్‌ తీయడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు. దాంతో ఐపీఎల్‌లో ఈ ఫీట్ సాధించిన 15వ భారత బౌలర్‌గా, మొత్తంగా 19 బౌలర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో తొలి వికెట్ తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. ఐపీఎల్ వికెట్లలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఐపీఎల్‌లో షమీ తీసిన తొలి వికెట్, 50వ వికెట్, 100వ వికెట్ క్లీన్ బౌల్డ్ ద్వారనే ఖాతాలో వేసుకున్నాడు. షమీ వేసిన ఫుల్ డెలివరీని ఆడటంలో కాన్వే విఫలమవ్వడంతో రెండు వికెట్లు నేలకూలాయి. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News