MI Vs DC: 4,6,6,6,4,6 అంకెలు కాదండోయ్.. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రొమారియో షెపర్డ్

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద పారించారు.

Update: 2024-04-07 13:01 GMT
MI Vs DC: 4,6,6,6,4,6 అంకెలు కాదండోయ్.. ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడిన రొమారియో షెపర్డ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద పారించారు. ముందుగా టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ ఫిల్డింగ్ ఎంచుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఓపెన్లు రోహిత్ ఇషాన్ కిషన్ చక్కని ఆరంభాన్ని ఇచ్చారు. జట్టులో చేరిన సూర్యకుమార్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించాడు.

అతడు అవుటైన వెంటనే బ్యాటింగ్ వచ్చిన టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్‌ ఇద్దరూ కలిసి పరుగుల వరద పారించారు. ఈ క్రమంలోనే వాంఖడే స్టేడియం సిక్స్‌లు, ఫోర్లతో దద్దరిల్లింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో రొమారియో షెఫర్డ్ ఆడిన హిట్టింగ్ ఇన్నింగ్స్‌కే హైలెట్‌గా నిలిచింది. అన్రిచ్ నోర్ట్జే బౌలింగ్‌లో ఏకంగా 4,6,6,6,4,6 బాది 32 ప‌రుగులు పిండుకున్నాడు. దీంతో ఒకే ఓవ‌ర్‌లో 32 ప‌రుగులు ఇచ్చిన బౌల‌ర్‌గా అన్రిచ్ నోర్ట్జే రికార్డును న‌మోదు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో 5 వికెట్లు కోల్పోయి 234 ప‌రుగులు చేసింది. 

Tags:    

Similar News