పాండ్యాకు షాక్
ఐపీఎల్-17లో గురువారం పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు షాక్.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో గురువారం పంజాబ్ కింగ్స్‌ను ఓడించిన ఆనందంలో ఉన్న ముంబై ఇండియన్స్‌కు షాక్. ఆ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు భారీ జరిమానా పడింది. పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నిబంధనను ఉల్లంఘించింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో నిర్ణీత సమయంలోగా తమ బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోయింది. దీంతో ముంబై కెప్టెన్ పాండ్యాకు రూ.12 లక్షల జరిమానా విధించినట్టు ఐపీఎల్ నిర్వాహకులు శుక్రవారం వెల్లడించారు. ఈ సీజన్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని మినిమమ్ ఓవర్ రేట్ నిబంధనను ముంబై జట్టు ఉల్లంఘించడం ఇదే తొలిసారి. రెండోసారి పునరావృతమైతే కెప్టెన్ జరిమానా రూ. 24 లక్షలకు పెరగడంతోపాటు తుది జట్టు ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడనుంది. కాగా, పాయింట్స్ టేబుల్‌లో ముంబై 7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 4 ఓటములతో 7వ స్థానంలో ఉన్నది. తదుపరి మ్యాచ్‌లో ఈ నెల 22న రాజస్థాన్‌తో ఆడనుంది.