అతన్ని టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలి : మనోజ్ తివారీ

లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్‌‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తెలిపాడు.

Update: 2024-04-05 14:35 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్‌‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయాలని భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ తెలిపాడు. తాజాగా ఓ జాతీయ మీడియాతో మనోజ్ తివారీ మాట్లాడుతూ.. తాను చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉంటే బుమ్రా, షమీ తర్వాత మయాంక్‌ను ఎంపిక చేస్తానని చెప్పాడు. ‘మయాంక్ ఫామ్, బౌలింగ్ యాక్షన్, బంతిని వదిలే విధానం చూస్తుంటే అతను పూర్తి నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నాడు. అతనికి పెద్ద వేదికల్లో అవకాశం ఇస్తే రాణించగలడనిపిస్తుంది.’ అని చెప్పాడు. కాగా, టోర్నీలో మయాంక్ 6 వికెట్లతో లక్నో తరపున టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 

Tags:    

Similar News