ఐపీఎల్ 2024.. అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన యువ బౌలర్
ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ క్రియేట్ చేసిన హిస్టరీ మరువక ముందే మరో యువ బౌలర్ చరిత్ర సృష్టించాడు.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ క్రియేట్ చేసిన హిస్టరీ మరువక ముందే మరో యువ బౌలర్ చరిత్ర సృష్టించాడు. లక్నో జట్టు తరపున నిన్నటి మ్యాచ్ లో అరంగేట్రం చేసిన యువ బౌలర్ మయాంక్ యాదవ్ మెరుపు స్పీడుతో బంతులు విసురుతూ.. పంజాబ్ బౌలర్లను బయపెట్టాడు. తన రెండవ ఓవర్ లో ఏకంగా 155.8 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి.. ఐపిఎల్ 2024లో సీజన్‌లో ఫాస్టెస్ట్ బౌలింగ్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా ఇంతకు ముందు ఈ సీజన్ లో రాజస్థాన్ బౌలర్ బర్గర్ పేరు మీద ఉన్న 153 కి.మీ వేగవంతమైన బంతి రికార్డును మయాంక్ బ్రేక్ చేశాడు. కాగా ఐపీఎల్ మొత్తం సీజన్లలో.. 2011లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ షాట్ టైట్ 157.71 కి.మీ వేగంతో వేసిన బంది.. అత్యంత వేగవంతమైన బంతిగా రికార్డులో ఉంది. ఇదిలా ఉంటే పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో మయాంక్ 4 ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.