లక్నోకు గుడ్ న్యూస్.. ఆ సంచలన బౌలర్ వచ్చేస్తున్నాడు
లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆ జట్టు బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించాడు.
దిశ, స్పోర్ట్స్ : లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆ జట్టు బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఫిట్‌నెస్ సాధించాడు. నేడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. ఈ విషయాన్ని లక్నో బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కల్ ధ్రువీకరించాడు. సోమవారం మోర్కెల్ మాట్లాడుతూ..‘మయాంక్ యాదవ్ ఫిట్‌గా ఉన్నాడు. అతను అన్ని ఫిట్‌నెస్ టెస్టులను క్లియర్ చేశాడు. అతను తిరిగి జట్టులో రావడం పట్ల సంతోషంగా ఉంది.’ అని తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో పంజాబ్‌పై ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ తన పేస్‌తో ప్రశంసలు అందుకున్నాడు. పంజాబ్‌పై, బెంగళూరుపై మూడేసి వికెట్లతో సత్తాచాటాడు. అయితే, గుజరాత్‌తో మ్యాచ్‌లో పొత్తి కడుపులో నొప్పితో మైదానం వీడిన అతను ఐదు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.