కేకేఆర్‌తో పోరులో కొత్త జెర్సీలో లక్నో ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
ఐపీఎల్-17లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు కొత్త జర్సీ ధరించనున్నారు.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో భాగంగా ఆదివారం కోల్‌కతా వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాళ్లు కొత్త జర్సీ ధరించనున్నారు. ఇప్పటివరకు బ్లూ జెర్సీలో కనిపించిన లక్నో ప్లేయర్లు కేకేఆర్‌పై మెరూన్, గ్రీన్ కలర్స్‌తో ఉన్న జెర్సీలో కనిపించనున్నారు. ఈ మ్యాచ్ కోసం లక్నో స్పెషల్ జెర్సీ ధరించడం వెనుక కారణముంది. భారత ఫుట్‌బాల్ క్లబ్ మోహన్ బగాన్ సూపర్ జెయింట్స్ కూడా లక్నో యాజమాన్యం ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూపునకు చెందినదే. ఆ క్లబ్ జెర్సీ మెరూన్, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్‌ను కలిగి ఉన్న మోహన్ బగాన్ క్లబ్ స్ఫూర్తితో లక్నో ప్లేయర్లు ఈ మ్యాచ్‌లో ఆ జెర్సీని ధరించాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. అయితే, ఫుట్‌బాల్ క్లబ్ జెర్సీని ధరించడం ఇదే తొలిసారి. గత సీజన్లోనూ కేకేఆర్‌తో మ్యాచ్‌లో లక్నో మెరూన్, గ్రీన్ జెర్సీతో ఆడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఆ మ్యాచ్‌లో లక్నో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.