IPL 2024 : అదరగొట్టిన డికాక్, పూరన్, కృనాల్.. పంజాబ్ ముందు 200 లక్ష్యం

ఐపీఎల్-17లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కోసం ఎదురుచూస్తోంది.

Update: 2024-03-30 15:56 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో లక్నో సూపర్ జెయింట్స్ బోణీ కోసం ఎదురుచూస్తోంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడిన ఆ జట్టు.. రెండో గ్రూపు మ్యాచ్‌లో ఎలాగైనా గెలుపు ఖాతా తెరవాలని చూస్తోంది. ఆ దిశగానే శనివారం లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ ముందు లక్నో జట్టు 200 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచిన లక్నో ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్లు కోల్పోయి 199 స్కోరు చేసింది. ఓపెనర్ డికాక్(54) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. అలాగే, కెప్టెన్ నికోలస్ పూరన్(42), కృనాల్ పాండ్యా(43 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో భారీ స్కోరు చేసింది. కేఎల్(15), దేవదత్ పడిక్కల్(9), స్టోయినిస్(19), ఆయుష్ బడోని(8) నిరాశపరిచారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లతో రాణించాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు 2 వికెట్లు దక్కగా.. రబాడ, రాహుల్ చాహర్‌ తలా ఒక వికెట్ తీశారు. 

Tags:    

Similar News