గ్రీన్ జెర్సీలో ఆర్సీబీ.. ఎందుకంటే?.. ఈ సారి కూడా కలిసిరాలే

ఐపీఎల్-17లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లు బ్లూ, గ్రీన్ జెర్సీలో కనిపించారు.

Update: 2024-04-21 14:13 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లు బ్లూ, గ్రీన్ జెర్సీలో కనిపించారు. ఈ సీజన్‌లో వారు బ్లూ, ఎరుపు జెర్సీ ధరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, కేకేఆర్‌తో పోరులో మాత్రం ఆర్సీబీ ప్లేయర్లు బ్లూ, గ్రీన్ డ్రెస్ ధరించడానికి ఓ కారణముంది. ‘గో గ్రీన్‌’లో భాగంగా ఆర్సీబీ గ్రీన్ కిట్‌ను ఉపయోగించింది. మొక్కలు నాటడం, వ్యర్థాలను తగ్గించడం, పచ్చదనం, పరిశుభ్రమైన వాతావరణంపై అవగాహన కల్పించడం ‘గో గ్రీన్’ ఉద్దేశం. స్టేడియంలో సేకరించిన వ్యర్థాలతో గ్రీన్ కిట్‌ను తయారు చేయడం విశేషం.

అయితే, గ్రీన్ జెర్సీని ధరించడం ఇదే మొదటిసారి కాదు. 2011 నుంచి ఆర్సీబీ ‘గో గ్రీన్’‌లో భాగంగా ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌లో ఆ జట్టు ఆటగాళ్లు గ్రీన్ జెర్సీని ధరిస్తారు. అయితే, గ్రీన్ జెర్సీ ధరించడం ఈ సారి కూడా ఆ జట్టుకు కలిసిరాలేదు. ప్రత్యేక జెర్సీ ధరించిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఎక్కువసార్లు ఓడింది. కోల్‌కతా మ్యాచ్‌లోనూ పరాజయం చవిచూసింది. మొత్తంగా గ్రీన్ జెర్సీతో ఆడిన 13 మ్యాచ్‌ల్లో ఆ జట్టు నాలుగుసార్లు మాత్రమే విజయం సాధించగా.. 8 సార్లు ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 

Tags:    

Similar News