ఇషాన్ కిషన్‌కు ఫైన్
ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు జరిమానా పడింది.
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు జరిమానా పడింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించాడు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులు అతన్ని మందలించడంతోపాటు మ్యాచ్ ఫీజులో 10 కోత పెట్టారు. ‘ఇషాన్ కిషన్ ఐపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. నేరాన్ని ఒప్పుకోవడంతోపాటు మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించాడు.’ అని ఐపీఎల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.
మ్యాచ్ సమయంలో క్రికెట్ పరికరాలు, గ్రౌండ్ పరికరాలను దుర్వినియోగం చేయడం, డ్రెస్సింగ్ రూమ్ తలుపులు, అద్దాలు, కిటికీలు, ఏవైనా ఇతర వస్తువులకు నష్టం కలిగించేలా వ్యవహరించడం ఆర్టికల్ 2.2 ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ఇషాన్ కిషన్ చేసిన తప్పిదంపై లీగ్ నిర్వాహకులు స్పష్టతనివ్వలేదు. కాగా, ఈ సీజన్‌లో ఇషాన్ కిషన్ బ్యాటుతో సత్తాచాటలేకపోతున్నాడు. బెంగళూరుపై హాఫ్ సెంచరీ మినహా అతను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 మ్యాచ్‌ల్లో 23.55 సగటుతో 212 పరుగులే చేసిన అతనికి టీ20 వరల్డ్ కప్ జట్టులో చోటు కష్టమే.