దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. దీంతో ఈ సీజన్‌లో అతని ఖాతాలో మరో రికార్డు చేరింది. రెండుసార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఏకైక భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. విరాట్ 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు చేశాడు. అందులో సెంచరీతోపాటు ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న కోహ్లీకి రూ. 15 లక్షల క్యాష్ ప్రైజ్ అందనుంది. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం కోహ్లీకి ఇది రెండోసారి. 2016లో 973 పరుగులు చేసి ఆ సీజన్‌లో హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో రెండు సార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, అత్యధికసార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన క్రికెటర్ల జాబితాలో వార్నర్(3) తర్వాత క్రిస్ గేల్‌తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు.