ఢిల్లీకి ఎదురుదెబ్బ.. ఇషాంత్ శర్మకు గాయం

Update: 2024-03-23 16:28 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శనివారం పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో 6వ ఓవ‌ర్‌లో బౌండ‌రీ వద్ద బంతిని అడ్డుకునే క్రమంలో ఇషాంత్ కాలుకు గాయమైంది. నొప్పితో విల‌విలలాడిన‌ ఇషాంత్ శర్మ మైదానాన్ని వీడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేసిన ఇషాంత్.. శిఖర్ ధావన్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతోపాటు 16 పరుగులు ఇచ్చాడు.

మ్యాచ్ అనంతరం ఢిల్లీ కెప్టెన్ పంత్ మాట్లాడుతూ.. ఇషాంత్ శర్మ గాయపడటం తమ విజయవకాశాలను దెబ్బతీసిందని చెప్పాడు. ‘అప్పటికే మాకు ఓ బౌలర్ తక్కువగా ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా అభిషేక్ పోరెల్‌ను తీసుకోవడంతో మాకు ఎక్స్‌ట్రా బౌలర్ లేడు. అదే సమయంలో ఇషాంత్ శర్మ గాయపడటం మా విజయవకాశాలను దెబ్బ తీసింది. అయినప్పటికీ మా బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు.’ అని పంత్ చెప్పుకొచ్చాడు.

ఇషాంత్ శర్మపై గాయం తీవ్రతపై స్పష్టత రాలేదు. దీంతో మిగతా మ్యాచ్‌ల్లో అతను పాల్గొనడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇషాంత్ శర్మ దూరమైతే ఢిల్లీకి భారీ లోటే అని చెప్పొచ్చు. 

Tags:    

Similar News