BREAKING: వింటేజ్ పంత్ ఈస్ బ్యాక్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్-2024లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్లు రాణించడంతో ప్రత్యర్థి చెన్నై ముందు ఢిల్లీ భారీ టార్గెట్

Update: 2024-03-31 16:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2024లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్‌లో ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. బ్యాటర్లు రాణించడంతో ప్రత్యర్థి చెన్నై ముందు ఢిల్లీ భారీ టార్గెట్ పెట్టింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఢిల్లీకి ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ మంచి శుభారంభానిచ్చారు. పృథ్వీ షా 43 పరుగులు చేయగా.. వార్నర్ హాఫ్ సెంచరీతో (52) రాణించాడు. స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ హాఫ్ సెంచరీతో (51) ఆకట్టుకున్నాడు. పంత్ కెప్టెన్ ఇన్సింగ్ ఆడటంతో ఢిల్లీ భారీ స్కోర్ నమోదు చేసింది. ప్రమాదం తర్వాత తిరిగి ఐపీఎల్ ఆడుతోన్న పంత్.. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాది వింటేజ్ పంత్‌ను గుర్తుచేశాడు. చెన్నై బౌలర్లలో మహేష్ పతిరణ 3, జడేజా, ముస్తాఫిజుర్ రెహ్మన్ చెరో వికెట్ తీశారు. అనంతరం చెన్నై 192 పరుగుల భారీ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగింది. పంత్ అర్థ సెంచరీతో రాణించడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. వింటేజ్ పంత్ ఈస్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Similar News